
- 21
- 0
Ratheemanmadha Kadha Parayanam
ఆహ్లాదకరమైన ఈ ప్రకృతిలో ప్రతీ ఋతువూ అద్భుతమైనదే ! సన్నజాజులు , చేమంతులు , గులాబీల గుబాలింపులతో మనసుకు హాయిగొలిపే వాతావరణం నెలకొంది ఆ హాల్లో . పచ్చని ప్రకృతిపరిసరాల మధ్యన, నగరవాతావరణానికి దూరంగా, మన్మధ్ అభిరుచులకి తగ్గట్లు రూపుదిద్దుకొన్న నేచర్ కౌంటీ పక్షుల కిలాకిలారావాలతో జీవించే క్షణాలకి అద్దం పడుతోంది . కౌంటీకి దగ్గరలోనే శ్రావణి , మన్మధ్ లకి సంబంధించిన ఫ్రండ్స్ , చుట్టాలు ఉండటం వలన దూరంగా ఉన్నామన్న ఆలోచనలే కలగదు అక్కడి వారికి . పూలసుగంధాలతో బాటు అగరుబత్తీల పరిమళం గాలిలో తేలియాడుతూ వస్తోంది...